
మంత్రాల పేరుతో బాలికపై లైంగిక వేధింపులు
ఆదిలాబాద్‌టౌన్: మంత్రాల పేరుతో బాలికను లైంగికంగా వేధించిన ఒకరిపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. ఆదిలా బాద్ పట్టణంలోని ఓ కాలనీకి చెందిన బాలిక ఆరోగ్యం సరిగా లేకపోవటంతో కుటుంబ సభ్యులు గాదిగూడ మండలం మారెగాంకు చెందిన షేక్ కలీంను సంప్రదించారు. బాలికను పరిశీలించి దుష్టశక్తి సోకిందని నమ్మించాడు. బాలికను నిర్మల్ మండలం సోన్ వద్ద గల గోదావరి వద్దకు తీసుకెళ్లి పూజలు చేసి తీసుకొచ్చాడు. రెండు రోజుల క్రితం ఇంట్లో ఒంటరిగా అమ్మాయితో కొన్ని పూజలు చేయాలని నమ్మబలికి గదిలోకి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు. విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు తెలుపడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు, బ్లాక్ మ్యాజిక్ రిమైడీస్ యాక్ట్, మోసం తదితర కేసులు నమోదు చేసినట్లు వివరించారు.
గోదావరిలో చిక్కుకున్న ఇద్దరు యువకులు
కడెం: మండలంలోని లక్ష్మీసాగర్ గ్రామ సమీ పంలోని గోదావరిలో చిక్కుకున్న ఇద్దరు యు వకులను గ్రామస్తులు కాపాడారు. మండలంలోని మద్దిపడగ గ్రామానికి చెందిన రాజ్‌కుమార్, రాజేశ్ సోమవారం లక్ష్మీసాగర్ గోదావరి రేవులో చేపలు పట్టేందుకు వెళ్లారు. ఎస్సారెస్పీ వరద గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో చుట్టూ నీళ్లు చేరాయి. దీంతో కుర్రులో ఉన్న యువకులు లక్ష్మీసాగర్ గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తులు గజ ఈతగాడి సహాయంతో కుర్రులో చిక్కుకున్న యువకులను తెప్పపై బయటకు తీసుకొచ్చారు.