
మిస్టర్ ఆదిలాబాద్.. మొగిలి
బెల్లంపల్లి బూడిదగడ్డ బస్తీకి చెందిన జనగాం మొగిలి ఖైరిగూడ ఓసీపీలో ఈపీ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. బాడీబిల్డింగ్‌లో ప్రతిభపాటవాలకు కొదువ లేదు. 2018–19లో బాడీబిల్డింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో కోలిండియా చాంపియన్‌షిప్ సాధించి తానేంటో నిరూపించుకున్నాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్రోళిలో జరిగిన కోలిండియా పోటీల్లో 70కిలోల విభాగంలో బంగారు పతకం గెల్చుకున్నాడు. వ్యక్తిగతంగా ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించి శెభాష్ అనిపించుకున్నాడు. మంచిర్యాల జిల్లా కేంద్రం సీసీసీలో ఐదేళ్ల క్రితం జరి గిన మిస్టర్ ఆదిలాబాద్ బాడీబిల్డింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో 70కిలోల విభాగంలో బంగారు పతకం అందుకున్నాడు. మహానది కోల్‌ఫీల్డ్స్ ఒడిశాలో గత ఏడాది జరిగిన బాడీబిల్డింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో వెండి పతకం సాధించాడు.
వరుసగా చాంపియన్‌షిప్ సాధనే లక్ష్యం
సింగరేణి కార్మికుడిగా ఇప్పటివరకు వివిధ ఏరియాల్లో విధులు నిర్వర్తించాను. నిలకడ లేకుండా వేరే ప్రాంతాలకు బదిలీ వల్ల బాడీబిల్డింగ్‌పై సరిగా దృష్టి సారించలేదు. ప్రస్తుతం సొంత ఏరియా బెల్లంపల్లికి బదిలీ కావడంతో పూర్తి సమయం వెచ్చించే అవకాశం లభించింది. బాడీబిల్డింగ్ పోటీల్లో వరుసగా ఐదేళ్లు ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించడం లక్ష్యంగా పెట్టుకుని కసరత్తు చేస్తున్నాను. మిస్టర్ సింగరేణి సాధించాలనే బలమైన కోరిక కూడా ఉంది. – జనగాం మొగిలి, క్రీడాకారుడు