
ఇందన్‌పల్లి రేంజ్ అధికారి సస్పెన్షన్
జన్నారం: అక్రమంగా కలప తరలిపోయినా నిర్లక్ష్య ం వహించినందుకు ఇద్దరు అటవీ అధికారులపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటువేశారు. జన్నారం అటవీ డివిజన్ ఇందన్‌పల్లి అటవి రేంజ్, కవ్వాల్ సెక్షన్, బంగారు తాండా బీట్ పరిధిలో టేకు చెట్లు అక్రమంగా నరికినా అధికారులు దృష్టి సారించకపోవడం, విధుల్లో నిర్లక్ష్యం వహించారనే అభియోగంపై ఇందన్‌పల్లి రేంజ్ అధికారి శ్రీధరచారి, బంగారుతండా బీట్ అధికారి ప్రణయ్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎఫ్‌డీపీటీ శాంతరాం తెలిపారు. గత నెలలో కొందరు బంగారుతాండా బీట్ పరిధిలోని కంపార్టుమెంట్ నంబర్ 244 లో పది టేకు చెట్లు నరికివేశారు. కలప అక్రమంగా తరలించుకుపోయారు. కలప విలువ సుమారుగా రూ.5 లక్షలు ఉంటుందని తెలిసింది. ఉన్నతాధికారులు స్పెషల్ పార్టీ, ప్లయింగ్ స్క్వాడ్ సిబ్బందితో తనిఖీ చేయగా కలప తరలిపోయినట్లు తేలింది. దీంతో ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వేసినట్లు సమాచారం. ఇందన్‌పల్లి పరిధిలో తడకలు విషయం కూడా ఇందుకు తోడయినట్లు తెలిసింది. అయితే సస్పెన్షన్ ఉత్తర్వులు అధికారులకు చేరలేదని సమాచారం. నాలుగు నెలలకే ఎఫ్‌ఆర్వో సస్పెండ్ ఆవడం చర్చనీయాంశంగా మారింది.
ప్రణయ్‌రెడ్డి
శ్రీధరచారి

ఇందన్‌పల్లి రేంజ్ అధికారి సస్పెన్షన్