
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
దహెగాం: మండలంలోని బోర్లకుంట గ్రామానికి చెందిన జు మ్మిడి మధుకర్ శుక్రవారం వా గులో గల్లంతైన విషయం తెలి సిందే. అతని ఆచూకీ కోసం మూ డు రోజులుగా గజ ఈతగాళ్లు వెతుకుతుండగా ఆది వారం మృతదేహం లభించింది. డీఎస్పీ వహీదుద్దీన్ ఆధ్వర్యంలో గాలింపు చేపట్టారు. కో త్మీర్, బీబ్రా గ్రామాల మధ్యలో వాగులో మృతదేహం లభ్యమైందని ఎస్సై విక్రమ్ తెలిపారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు బోటు సహాయంతో గాలింపు చర్యలను పర్యవేక్షించారు. మృతుడి సోదరుడు దామాజీ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.