రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
ఖానాపూర్: చేపల వేటకు వెళ్లిన జాలరి వలలో చిక్కుకుని మృతిచెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బీర్నందికి చెందిన ఆర్మూరి రవి (38) ఆదివారం గ్రామ సమీపంలోని కడెం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌లో చేపల వేటకు వెళ్లాడు. అప్పటికే చేపలు పట్టేందుకు ఏర్పాటు చేసిన వలల వద్దకు తెప్పపై వెళ్లేక్రమంలో జారిపడ్డాడు. చేపల కోసం వేసిన వల అతని కాళ్లకు చుట్టుకుంది. దీంతో ఎటూ కదలలేక నీటిలో మునిగి మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కుభీర్: మండలంలోని చొండిగ్రామానికి చెందిన షేక్ ఖాసిం (28)వాగులో పడి మృతిచెందాడు. ఎస్సై క్రిష్ణారెడ్డి కథనం ప్రకారం.. ఖాసిం అనే కాపరి శనివారం పశువులను తొడ్కొని వాగుదాటుతున్నాడు. ఈక్రమంలో పక్కనే ఉన్న గుంతలో ప్రమాదవశాత్తు పడి ఈతరాక మృతిచెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
భీమారం: మండలంలోని మద్దికల్‌కు చెందిన కొర్తె కిష్టయ్య (50) జ్వరంతో బాధపడుతూ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. మూడు రోజుల క్రితం కిష్టయ్య జ్వరం రావడంతో కుటుంబీకులు మంచిర్యాల ఆసుపత్రికి తీసుకెళ్లారు. రక్తకణాలు తగ్గుతున్నాయని మెరుగైన చికిత్స కోసం వైద్యులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి రిఫర్ చేశారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా ఆదివారం ఉదయం చికిత్స పొందుతూ మృతిచెందాడు. కాగా, మృతుడు చిరుతల రామాయణంలో పలుమార్లు కుంభకర్ణుని పాత్రవేసి గ్రామస్తుల మన్ననలు పొందాడు. మృతుడికి భార్మ చంద్రక్క, ముగ్గురు కుమారులు ఉన్నారు.
కాగజ్‌నగర్‌టౌన్: సికింద్రాబాద్ నుంచి దానాపూర్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ సురేష్‌గౌడ్ తెలిపారు. ఆదివారం కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్ ఫ్లాట్‌పాం 1 వద్ద దానాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి జారిపడ్డాడు. ప్లాట్‌పాం, రైలు మధ్యలో ఇరుక్కుపోయాడు. గమనించిన రైల్వే సిబ్బంది అతన్ని బయటకు తీసి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సదరు వ్యక్తి వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, గ్రీన్ కలర్ రౌండ్‌నెక్ ఆఫ్ టీఛర్ట్, బ్లాక్ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడని పేర్కొన్నాడు.
చేపల వలలో చిక్కి జాలరి..
వాగులో పడి యువకుడు..
జ్వరంతో ఒకరు..
ఎదురెదురుగా ట్యాంకర్, లారీ ఢీ
కాసిపేట: మండలంలోని సోమగూడెం దేవాపూర్ ప్రధాన రోడ్డుపై కాసిపేట జెడ్పీ పాఠశాల మూలమలుపు వద్ద ఆదివారం సాయంత్రం ట్యాంకర్, లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వాహనాలు నుజ్జునుజ్జుకాగా, డ్రైవర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. ఫిర్యాదు తర్వాత వివరాలు వెల్లడిస్తామని ఎస్సై ఆంజనేయులు తెలిపారు.
1/2
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
2/2
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి