
ముగిసిన సెపక్‌తక్రా పోటీలు
విజేతగా జూనియర్స్ విభాగంలో ఆదిలాబాద్ బాలికల జట్టు బాలురలో రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానం సబ్ జూనియర్స్ పోటీలో వరంగల్ బాలికల జట్టు బాలుర విభాగంలో మహబూబ్‌నగర్ జిల్లా
రెబ్బెన: గోలేటి టౌన్‌షిప్‌లోని సింగరేణి ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో రెండురోజులుగా నిర్వహిస్తున్న 11వ రాష్ట్రస్థాయి జూనియర్స్, సబ్ జూనియర్ సెపక్‌తక్రా పోటీలు ఆదివారం ము గిశాయి. హోరాహోరీగా సాగిన చివరిరోజు ఫైనల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ బాలికల జట్టు విజేతగా నిలిచింది. బాలుర విభాగంలో రంగారెడ్డి జిల్లా జట్టు, సబ్ జూనియర్స్‌లో వరంగల్ బాలికల జట్టు, మహబూబ్‌నగర్ బాలుర జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక జూనియర్స్ విభాగంలో ఉమ్మడి ఆదిలాబాద్ జట్టు తృతీయ స్థానంలో నిలవగా సబ్ జూనియర్స్‌లో ఆదిలాబాద్ బాలుర, బాలికల జట్లు మూడో స్థానంలో నిలిచాయి. విజేతగా నిలిచిన జట్లకు బెల్లంపల్లి ఏరియా ఇన్‌చార్జి జీఎం నరేందర్ ట్రోఫీతోపాటు షీల్ట్‌లు అందజేశారు.
నిరంతర సాధనతోనే విజయాలు..
అంతకుముందు పోటీల ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా బెల్లంపల్లి ఏరియా ఇన్‌చార్జి జీఎం నరేందర్ హాజరై మాట్లాడారు. క్రీడాకారులు ఆటలో నైపుణ్యాలు మెరుగుపర్చుకునేందుకు నిరంతర సాధనతోనే అద్భుత విజయాలు సొంతమవుతాయన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులను అభినందించారు. సెపక్‌తక్రా అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి విజయ భాస్కర్‌రెడ్డి, జారీఫ్ ఉద్దీన్‌ఖాన్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎస్.తిరుపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భాస్కర్, రామకృష్ణ, కుమ్మరి మల్లేశ్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణరెడ్డి, ఎస్సై వెంకటకృష్ణ పాల్గొన్నారు.