
పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య
నేరడిగొండ: పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఇమ్రాన్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని వడూర్ గ్రామానికి చెందిన కాడారి వినోద్ (23) ఫర్టిలైజర్ షాప్‌లో పనిచేస్తున్నాడు. గత నాలుగు రోజుల నుంచి పనికి వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెంది ఆదివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తండ్రి రవి ఫోన్ చేయగా సమాధానం ఇవ్వలేదు. అనుమానం వచ్చి చిన్న కుమారుడు వికాస్‌ను వెంట తీసుకుని వ్యవసాయ భూమికి వెళ్లి చూడగా పత్తి చేనులో వినోద్ అపస్మారక స్థితిలో కిందపడి ఉన్నాడు. చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో బోథ్ ప్రభుత్వ ఆసుపత్రి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఘటన స్థలంలో మోనోసిల్ పురుగుల మందుతోపాటు థమ్సప్ బాటిల్ ఉంది. పంచనామా అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఉరేసుకుని వివాహిత
మంచిర్యాలరూరల్(హాజీపూర్): జీవితంపై విరక్తితో వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హాజీపూర్ ఎస్సై స్వరూప్‌రాజ్ కథనం ప్రకారం..మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని నర్సింగాపూర్‌కు చెందిన గాదర్ల వెంకటేశ్, వాణి (30) దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు హర్షవర్ధన్, ఆదిత్య ఉన్నారు. వెంకటేశ్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అయితే శనివారం అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కి చీరతో ఉరేసుకుంది. మృతురాలి తల్లి తుమ్మ కళావతి ఫిర్యాదుతో ఆదివారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య