
రైతుల కోసమే ధన ధాన్య కృషి యోజన
బెల్లంపల్లి: రైతుల ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం ధన ధాన్య కృషి యోజన, పుప్పుధాన్యాల స్వావలంబన మిషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.ప్రసూన అన్నారు. శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలో మిషన్ కార్యక్రమాన్ని ప్రారంభించగా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేశారు. మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల రైతులు హాజరయ్యారు. కేవీకే శాస్త్రవేత్తలు ప్రియ సుగంధి, మహేష్, స్రవంతి, సాధ్వి, నాగరాజు, హాజీపూర్ ఎఫ్‌పీసీ సలహాదారు గోనే శ్యాంసుందర్‌రావు, డైరెక్టర్లు శ్రీనివాసరావు, తిరుపతి పాల్గొన్నారు.