
కొత్త ప్లాంటు పనుల పరిశీలన
జైపూర్: స్థానిక ఎస్టీపీపీలో మూడో యూనిట్ 800మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంటు పనులను రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ నందకుమార్ శనివారం పరిశీలించారు. కొత్త ప్లాంటు ప్రతిపాదిత ప్రాంతంలో సబ్‌స్టేషన్ పనులు పూర్తి కాగా ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి, జీఎం నరసింహరావు వివరించారు. అనంతరం రిజర్వాయర్‌లో 5 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్‌ప్లాంటును పరిశీలించారు. డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ రాజు, ఏజీఎంలు మదన్‌మోహన్, శ్రీనివాస్, వేణుగోపాల్, బీహెచ్‌ఈఎల్ ఇంజనీర్లు మధుకిరణ్, సూర్యరావు పాల్గొన్నారు.