
ఏళ్ల తరబడిగా తిరుగుతున్నా..
మాకున్న ఎనిమిది ఎకరాల పొలం కోసం బో రుబావి తవ్వించాం. విద్యుత్ కనెక్షన్ కోసం ఏఈని కలిస్తే నాలుగు స్తంభాలు, తీగలు తది తర సామగ్రి కోసం లైన్ ఎస్టిమేషన్, మ్యాప్ వేసి ఇచ్చారు. 2021 జూన్ 11న మా అమ్మ జాడి పద్మ పేరుతో రూ.5,295 చెల్లించి రశీదు, ఇతర ధ్రువీకరణ పత్రాలు అందజేసిన. కొన్ని నెలల వరకు లైన్ ఇవ్వలేదు. పేపర్లు పోయాయి అంటే మళ్లీ అందజేసిన. తహసీల్దార్ కార్యాలయం నుంచి సర్టిఫికేట్ కావాలంటే తీసుకొచ్చిన. ఏళ్ల తరబడి ఏదో కారణం చెబుతూ కనెక్షన్ ఇవ్వడం లేదు. 2023లో విద్యుత్ ప్రజావేదికలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే స్తంభాలు వేశారు. కానీ తీగలు లాగలేదు. కలెక్టరేట్ ప్రజావాణిలో రెండుసార్లు, విద్యుత్ శాఖ డీఈ, ఎస్‌ఈకి ఫిర్యాదు చేసినా కనెక్షన్ ఇస్తలేరు.
– జాడి హర్షవర్థన్, శంకర్‌పల్లి, సారంగపూర్, మం: మందమర్రి