
పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ 2024 మార్చి 31నుంచి పదవీ విరమణ పొందిన వారికి ఇప్పటికీ బెన్‌ఫిట్స్ అందించలేదని తెలిపారు. కుటుంబ అవసరాలకు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకరయ్య, ఎమ్మెస్‌రెడ్డి, మాధవరెడ్డి, ఇక్బాల్, కుమారస్వామి, వహిదొద్దీన్, తదితరులు పాల్గొన్నారు.