
కేసులు పెరగకుండా చర్యలు
జిల్లాలో ఫైలేరియా కేసులు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. కీటక జనిత నివారణ కార్యక్రమంలో భాగంగానే వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఫైలేరియా కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో సర్వే చేపట్టనున్నాం. ఇప్పటికే బృందాలు ఏర్పాటు చేసి రక్త పరీక్షలకు కిట్ల వినియోగంపై ల్యాబ్‌టెక్నీషియన్లకు అవగాహన కల్పించాం. ఫైలేరియా కేసులు లేకుండా చేయడమే లక్ష్యంగా కేసుల గుర్తింపు, చికిత్స, కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ అనిత,
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి