
13న హోమియోపతి ఉచిత వైద్య శిబిరం
మంచిర్యాలటౌన్: జాతీయ ఆయుష్ పథకంలో భాగంగా ఈ నెల 13న ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో హోమియోపతి ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో ఆయుష్ శాఖ వైద్య శిబిరం ఇంచార్జి డాక్టర్ సీహెచ్.స్పందన శిబిరానికి సంబంధించిన కరపత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉచిత హోమియోపతి వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.