
బీసీ సంఘాల ఆందోళన.. రాస్తారోకోలు
భీమారం: స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ శుక్రవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు, రాస్తారోకోలు నిర్వహించారు. భీమారం మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై బీసీ కులాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. బంద్‌కు పిలుపునివ్వగా వ్యాపారస్థంస్థలు, ప్రైవేటు పాఠశాలలు బంద్‌లో పాల్గొన్నాయి. అంతకుముందు బీసీ కులాల ఐక్య వేదిక నాయకులు ఆవిడం రోడ్డు నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. బీసీ కులాలకు 42శా తం రిజర్వేషన్లు దక్కకుండా అగ్రవర్ణ కులాలు ప్రయత్నాలు చేస్తున్నాయని మాజీ సర్పంచ్ బెల్లంకొండ నరేందర్, ఆవుల సురేష్, వేముల శ్రీకాంత్‌గౌడ్, పానుగంటి లక్ష్మణ్ విమర్శించారు. రిజర్వేషన్లను అడ్డుకోవడం హేయమైన చర్యగా అభివర్ణించారు. రాస్తారోకోకు ఇతర కుల సంఘాల నాయకులు కూడా సంఘీభావం తెలిపారు. ఎస్సై శ్వేత ఆందోళనకారులతో మాట్లాడి రోడ్డుపై నుంచి పక్కకు జరిపించారు.
మంచిర్యాలలో..
పాతమంచిర్యాల: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో శుక్రవారం బీసీ సంఘాల నాయకులు రాస్తారోకో నిర్వహించారు. బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్, బీసీ జేఏసీ జల్లా అధ్యక్షుడు వడ్డేపల్లి మనోహర్ మాట్లాడుతూ బీసీలకు హక్కులు రాకపోవడం వల్ల వెనుకబాటుకు గురవుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో జరిగిన అనేక ఉద్యమాల ప్రభావంతో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తామనే హామీతో బిల్లు తీసుకొచ్చిందని తెలిపారు. రాష్ట్రంలోని బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్ల కల్ప నకు ముందుకు రావాలన్నారు. రాజకీయ పార్టీలు హైకోర్టుకు తమ అభిప్రాయాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు బొలిశెట్టి లక్ష్మణ్, కర్నె శ్రీధర్, రమేష్, వైద్య భాస్కర్, రమణాచారీ, రాళ్లబండి రాజన్న, నరసింహ, విద్యార్థి నాయకులు వంశీ పాల్గొన్నారు.
దిష్టిబొమ్మ దహనం..
పాతమంచిర్యాల: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంతో శుక్రవారం జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు బీసీ రిజర్వేషన్ వ్యతిరేకుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకుడు డాక్టర్ నీలకంఠేశ్వర్‌రావు, బీసీ సంఘం నాయకులు నామని రాజేష్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజబాబు, బీసీ నాయకులు పాల్గొన్నారు.
టీఆర్పీ ఆధ్వర్యంలో..
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో శుక్రవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ) నాయకులు, తీన్మార్ మల్లన్న టీమ్ సభ్యులు సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.

బీసీ సంఘాల ఆందోళన.. రాస్తారోకోలు

బీసీ సంఘాల ఆందోళన.. రాస్తారోకోలు