
నిబంధనల ప్రకారం సమాచారం అందించాలి
● జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య
మంచిర్యాలఅగ్రికల్చర్: సమాచార హక్కు చట్టం దరఖాస్తులకు నిబంధనల ప్రకారం సమాచారం అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, అప్పిలేట్ అధికారులు, ప్రజాసమాచార, సహాయ ప్రజా సమాచార అధికారులతో సమాచార హక్కు చట్టం–2025పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ చంద్రయ్య మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంలో పారదర్శకత, జవాబుదారీతనం అవశ్యకమని అన్నారు. దరఖాస్తుదారులు కోరిన సమాచారాన్ని నిర్ణీత గడువులోగా అందజేయాలని సూచించారు. సమాజంలో ప్రతీ అంశంపై అవగాహన కలిగిన పౌరులు సమాజాభివృద్ధికి పునాది వంటి వారని తెలిపారు.
13న అప్రెంటిస్‌షిప్ మేళా
మందమర్రిరూరల్: మండల కేంద్రంలోని ప్ర భుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 13న అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ దేవానంద్ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నుంచి బహుళజాతి కంపెనీలతోపాటు స్థానిక ఇంజినీరింగ్ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని వివరించా రు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఐటీఐ పూర్తిచేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంటర్వ్యూకు వచ్చే వారు సంబంధిత ధ్రువపత్రాలు తీసుకురావాలని సూచించారు.