
‘రాజకీయ ప్రయోజనాల కోసమే రిజర్వేషన్ల అంశం’
పాతమంచిర్యాల: బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే సామాజిక బాధ్యత ప్రభుత్వం గుర్తించినప్పటికీ అందుకు చట్టబద్ధత చర్యలు లేకుండా కేవలం రాజకీయ లాభాల కోసమే రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకురావడం దురదృష్టకరమని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు కలవేన శంకర్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చట్ట పరిధిలో ఆలోచన చేయకపోవడం శోచనీయమని తెలిపారు. బీసీల హక్కుల సాధన పోరాటంలో సీపీఐ ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి ఖలిందర్ అలీఖాన్, నాయకులు వెంకటస్వామి, చంద్రశేఖర్, చిప్ప నర్సయ్య, కే.నగేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.