
ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన బృందం
బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని శుక్రవారం అస్కీ బృందం సందర్శించింది. ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్ ప్రకారం ఆసుపత్రిలోని పలు విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులకు అందిస్తున్న సేవలు, సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి నిర్వహణ నిర్వహణ తీరు, రోగులకు కల్పిస్తున్న సేవలపై బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో అస్కీ టీమ్ లీడర్ డాక్టర్ సందేష్‌రెడ్డి, ఏరియా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్, వైద్యులు మూర్తి, కిరణ్‌కుమారి, షబ్బీర్, సరిత రాథోడ్, నర్సింగ్ సూపరింటెండెంట్ జోసెఫిన్, సిబ్బంది పాల్గొన్నారు.