
పుస్తక రచనలో జిల్లా ఉపాధ్యాయులు
నిర్మల్‌ఖిల్లా: తెలంగాణ తెలుగు అకాడమీ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగే పుస్తక ప్రచురణ సంస్థ. సంస్థ డీఎస్సీకి రూపొందించిన స్టడీ మెటీరియల్‌లో భౌతిక రసాయన శాస్త్రం కంటెంట్ పుస్తక రచనలో నిర్మల్ జిల్లాకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులున్నారు. కడెం జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు పీ నారాయణవర్మ, తానూరు మండలం భోసి జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయురాలు సీహెచ్ వందనకుమారి భాగస్వాములయ్యారు. గత జనవరిలో ఈ పుస్తకం తుదిరూపు దిద్దుకోగా తాజాగా ప్రచురితమై అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ పుస్తకం డీఎస్సీ, టెట్ పరీక్షల కోసం తెలుగు మీడియం వారికి ప్రయోజనకారిగా ఉండనున్నట్లు పుస్తక రచయితలు తెలిపారు. వీరిరువురు 24 ఏళ్లుగా సైన్స్ ఫెయిర్, ప్రాజెక్ట్ పద్ధతుల ద్వారా విద్యార్థుల్లో సైన్స్‌పై జిజ్ఞాస పెంచడంలో సఫలీకృతులయ్యారు. పాఠ్యాంశాల బోధనలోనూ తమదైన ప్రత్యేక ముద్ర వేసుకున్నారు.
అందుబాటులోకి వచ్చిన తెలుగుఅకాడమీ పుస్తకం
నారాయణవర్మ, వందనకుమారి

పుస్తక రచనలో జిల్లా ఉపాధ్యాయులు