
ఆర్జీయూకేటీలో మానసిక ఆరోగ్య దినోత్సవం
బాసర: బాసర ఆర్జీయూకేటీలో శుక్రవారం మానసిక స్వస్థత కేంద్రం ఆధ్వర్యంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ.. వి ద్యార్థులు మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి ఉదయం వ్యాయామం, ధ్యానం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శారీరక వ్యా యామాలు, ధ్యానం, మానసిక ఆరోగ్య అవగాహన కోసం క్యాంపస్‌లో ర్యాలీ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఓఎస్‌డీ ప్రొఫెసర్ మురళీదర్శ న్, ఆర్జీయూకేటీ మానసిక స్వస్థత కేంద్రం సిబ్బంది, శారీరక విద్యావిభాగ సిబ్బంది పాల్గొన్నారు.