
నెమలిని చంపిన నిందితుల అరెస్ట్
బోథ్: మండలంలోని పొచ్చెర గ్రామ సమీపంలోని చేనులో ముగ్గురు వ్యక్తులు జాతీయ పక్షి నెమలిని చంపారు. ఎఫ్‌ఆర్వో ప్రణయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గాదిగూడ మండలం ఖాండురాంపూర్ గ్రామానికి చెందిన బడ్వాల్ గంగాసింగ్ బోథ్ మండలం పొచ్చెర గ్రామంలో పాలేరుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 9న చేనులో గడ్డి కోస్తూ ఉండగా గంగాసింగ్‌కు నాలుగు నెమలి గుడ్లు కనిపించాయి. దీంతో అక్కడికి నెమలి వస్తుందని గమనించాడు. పొచ్చెర గ్రామంలోనే వలస కూలీలుగా ఉన్న గాదిగూడ మండలం లోకారికి చెందిన దత్తు, ఇంద్రవెల్లి మండలం గోపాల్‌పూర్‌కు చెందిన బాలాజీతో కలిసి గురువారం రాత్రి గుడ్లపై పొదిగిన నెమలిని కర్రతో కొట్టి చంపాడు. నెమలి, గుడ్లను బైక్‌పై తీసుకెళ్తుండగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్న అటవీశాఖ అధికారులు వారి ద్విచక్రవాహనం ఆపి తనిఖీ చేశా రు. వారి వద్ద చని పోయిన నెమలి, గుడ్లు కనిపించగా వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. వారిని రిమాండ్‌కు తరలించినట్లు ఎఫ్‌ఆర్వో తెలిపారు.
నిందితుల అరెస్ట్ చూపి వివరాలు వెల్లడిస్తున్న ఎఫ్‌ఆర్వో