
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
రెబ్బెన: మండలంలోని రెబ్బెన ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని ఖాళీ స్థలం వాగు ఒడ్డు వద్ద శుక్రవారం గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. కళాశాల సమీపాన ఉన్న అహ్మద్‌బిన్ మహ్మద్ ఖాళీ స్థలంలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచా రం అందించారు. దీంతో ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించినట్లు ఎస్సై తెలిపారు. మృతు డి వయస్సు 55–60 ఏళ్లు ఉంటుందని, 5.3 అడుగుల ఎత్తు, చామనచాయ రంగు ఉన్నట్లు పేర్కొన్నారు. మృతుడి ఒంటిపై మెరూన్ రంగు డ్రాయర్, నీలి రంగు టీషర్టు ఉన్నట్లు తెలిపారు. భిక్షాటన చేస్తూ పరిసర ప్రాంతాల్లో తిరుగుతుంటాడని, శుక్రవారం తెల్లవారుజామున ఆకలితో మృతి చెంది ఉంటాడని ఎస్సై భావిస్తున్నారు. కాగా, మృతుడి సమాచారం తెలిసినవారు 8712670532 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.