
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
జైపూర్: మండలంలోని కిష్టాపూర్ గోదావరి నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు. శుక్రవారం వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా కిష్టాపూర్ వద్ద గోదావరి నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల ను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఒక్క ట్రాక్టర్ షెట్‌పల్లి వద్ద, మరో రెండు ట్రాక్టర్లు నర్సింగాపూర్ వద్ద పట్టుబడగా వాటిని పోలీస్‌స్టేష న్ తరలించి యజమానులపై కేసులు నమో దు చేసినట్లు తెలిపారు. అనుమతి లేకుండా ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.