మహిళలు.. మహారాణులు! | - | Sakshi
Sakshi News home page

మహిళలు.. మహారాణులు!

Oct 11 2025 5:50 AM | Updated on Oct 11 2025 5:50 AM

మహిళల

మహిళలు.. మహారాణులు!

● స్వయం ఉపాధి వైపు అతివల చూపు ● తక్కువ వడ్డీ రుణాలతో వ్యాపారాలు ● పురుషులకు దీటుగా రాణిస్తున్న వైనం ● ఆర్థికాభివృద్ధి దిశగా అడుగులు..

గ్రామంలోనే వ్యాపారం చేస్తున్న

డ్వాక్రా సంఘంలో రూ.5లక్షలు రుణం తీసుకుని గ్రామంలోనే బట్టల షాపు, లేడీస్‌ టైలర్‌, ఎంబ్రాయిడరీ, మ్యాచింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న. స్వయంగా దూరప్రాంతాలకు వెళ్లి కొత్త కొత్త నమూనాలు ఎంపిక చేసి తీసుకువస్తున్న. కస్టమర్లు కోరిన నమూనాలు అందిస్తున్న. పది మందికి కుట్టు శిక్షణ కూడా ఇస్తున్న. వ్యాపారంలో వచ్చిన ఆదాయంతో కుటుంబ పోషణకు సహకారం అందిస్తున్న.

– పద్మ, తానూరు

తానూరు: మహిళలు పురుషులకు దీటుగా రాణిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోటీ ప్రపంచంలో పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఇంటిని చక్కదిద్దడమే కాదు.. కుటుంబ పోషణకు ఆర్థిక సహకారం అందిస్తున్నారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. విద్య, రాజకీయం, ఉద్యోగాలతో పాటు వ్యాపారంలోనూ రాణిస్తున్నారు. డ్వాక్రా సంఘంలో తక్కువ వడ్డీకి రుణాలు తీసుకుని కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే వివిధ వ్యాపారాల్లో రాణిస్తూ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న కొందరు మహిళలపై కథనం..

ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న

సంఘంలో రుణం తీసుకుని ఆర్‌సీఎం హోల్‌సేల్‌ షాప్‌ ప్రారంభించిన. వ్యాపారంలో కొనసాగుతూ లాభాలు గడిస్తున్న. వ్యాపారంలో వచ్చిన ఆదాయాన్ని రుణ వాయిదాలు చెల్లించి మిగతా డబ్బులను కుటుంబ పోషణ కోసం ఖర్చు చేస్తున్న. కొంత మొత్తాన్ని పొదుపు కూడా చేస్తున్న. నా భర్తకు చేదోడువాదోడుగా ఉంటూ ఆర్థికాభివృద్ధి సాధించడం సంతోషంగా ఉంది.

– అంజనాబాయి, తానూరు

సీ్త్రశక్తి ద్వారా రుణాలిస్తున్నాం

గ్రామాల్లో డ్వాక్రా సంఘాల మహిళలకు వ్యాపారం చేసుకోవడానికి సీ్త్రశక్తి ద్వారా తక్కవ వడ్డీకి రుణాలు ఇస్తున్నాం. స్వయం ఉపాధి వైపు వారిని ప్రోత్సహిస్తున్నాం. ఇప్పటికే తానూరు మండలంలో 725 మహిళా సంఘాలు కొనసాగుతున్నాయి. ఈ సంఘాలకు రూ.16కోట్ల రుణాలందించాం. రుణాలు పొందిన మహిళలు వ్యాపారాలు కొనసాగిస్తూ ఆర్థికాభివృద్ధి చెందుతున్నారు.

– సులోచనరెడ్డి, ఐకేపీ ఏపీఎం

ప్రమిదలు తయారు చేస్తున్న

గ్రామంలోని స్వయం సహాయక సంఘం ద్వారా రుణం తీసుకుని మట్టి ప్రమిదలు తయారు చేస్తున్న. వాటిని స్వయం సహాయక సంఘాలు, మార్కెట్‌కు సరఫరా చేస్తూ లాభాలు పొందుతున్న. ఇప్పటికే డ్వాక్రా సంఘాలకు ఐదువేల ప్రమిదలు సరఫరా చేసేందుకు అధికారుల నుంచి ఆర్డర్‌ వచ్చింది. రుణం తీసుకుని కులవృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న.

– చంద్రబాయి, కోలూరు

ఇంటి పనులు చేసుకుంటూనే..

డ్వాక్రా సంఘంలో తక్కువ వడ్డీకి రుణం తీసుకుని మార్కెట్‌లో బ్యూటీ పార్లర్‌, లేడీస్‌ టైలరింగ్‌, ఎంబ్రాయిడరీ, మ్యాచింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న. మా పిల్లలను పాఠశాలకు పంపించి ఇంటి పనులు ముగించుకుని వ్యాపారం చేస్తున్న. టైలరింగ్‌లో యువతకు శిక్షణ ఇస్తున్న. ఒక వ్యాపారం చేస్తున్నప్పుడే కొత్త ఆలోచనలకు అవకాశం కలుగుతుంది. సమాజంపై అవగాహన వస్తుంది.

– విజయలక్ష్మి, తానూరు

మహిళలు.. మహారాణులు!1
1/3

మహిళలు.. మహారాణులు!

మహిళలు.. మహారాణులు!2
2/3

మహిళలు.. మహారాణులు!

మహిళలు.. మహారాణులు!3
3/3

మహిళలు.. మహారాణులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement