
చెరువులో దూకి రిటైర్డ్ కార్మికుడి ఆత్మహత్య
తాండూర్: మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు పెద్దింటి ప్రభాకర్(64) గురువారం గ్రామ శివారులోని చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై కిరణ్‌కుమార్ కథనం ప్రకారం.. ప్రభాకర్ గత కొంత కాలంగా తీవ్రంగా మద్యానికి బానిసకావడంతో కుటుంబ సభ్యులు తరచూ మందలించేవారు. గురువారం తీవ్రంగా మద్యం తాగిన ప్రభాకర్‌ను మందలించడంతో మనస్తాపం చెందాడు. చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య రాజేశ్వరి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.