గతంలో అనేక ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యే నాకు కొంత కాలం క్రితం మెడ, వెన్నుపూసను కలిపే సర్వైకల్ భాగంలో మేజర్ సర్జరీ జరిగింది. స్వతహాగా ఈత అంటేనే అమితమైన అభిరుచి కలిగిన నేను ప్రతీరోజు ఉదయం 5 గంటలకు బంగల్‌పేట చెరువుకు చేరుకొని స్విమ్మింగ్ చేస్తాను. ఆపరేషన్ అనంతరం స్వల్పకాలంలోనే పూర్తిగా కోలుకున్నాను. విశాలమైన ప్రకృతిసిద్ధ చెరువులో వందల మీటర్ల పరిధిలో ఈత కొట్టడం ద్వారా శరీరం తేలికగా మారుతుంది.– డీవీ.రమణ,
రిటైర్డ్ సూపరింటెండెంట్, నిర్మల్