
దినచర్యలో భాగం కావాలి..
వయసుతో నిమిత్తం లేకుండా అందరూ స్విమ్మింగ్‌ను దినచర్యలో భాగంగా అలవాటు చేసుకోవాలి. తద్వారా మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పులు తగ్గుతాయి. శరీరంలోని అనవసర క్యాలరీలు కూడా తగ్గి రోజంతా తేలికగా ఉంటుంది. నరాల సంబంధిత వ్యాధులు దరిచేరవు. శ్వాసకోశ సమస్యలు దూరమవుతాయి. మంచి ిఫిట్‌నెస్ సాధించగలుగుతాం. నిర్మల్‌లో నీటి వనరులు పుష్కలంగా ఉన్న బంగల్‌పేట్ చెరువు, ఖజానా చెరువు ఈతకు అనుకూలంగా ఉన్నాయి.– డాక్టర్ లక్ష్మీనరసింహ రెడ్డి,
స్విమ్మర్, న్యూరో ఫిజీషియన్, నిర్మల్