
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
బెల్లంపల్లి: జిల్లా కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం అండర్ 19 విభాగంలో రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడాకారుల ఎంపిక పోటీలు జరిగాయి. కాసిపేట బాలుర గురుకుల పాఠశాల విద్యార్థి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. పోటీల్లో కాసిపేట సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల పదో తరగతి విద్యార్థి పి.స్వామి ప్రతిభ చూపి పోటీలకు ఎంపికై నట్లు గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ సంతోష్ కుమార్ తెలిపారు.
నెట్‌బాల్ పోటీలకు..
కాసిపేట: మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్‌స్కూల్‌కు చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు అర్జున్, వికాస్‌లు రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ ఖలీల్ బుధవారం తెలిపారు. నెట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈనెల 9 నుంచి 11 వరకు మహబూబాబాద్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి నెట్‌బాల్, జూనియర్ విబాగం పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. పీఈటీ శ్రీనివాస్, ఉపాధ్యాయులు అభినందించారు.
జన్నారం: జన్నారం మండలం స్లేట్ హైస్కూల్ కు చెందిన ముగ్గురు విద్యార్థులు రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు ఆ విద్యా సంస్థల చైర్మన్ ఏనుగు శ్రీకాంత్‌రెడ్డి బుధవారం తెలిపారు. విద్యార్థులు భానుచరణ్, అరవింద్, తేజశ్విన్‌లు మంచిర్యాల జిల్లా నుంచి క్రీడల్లో పాల్గొంటారని తెలిపారు. డైరెక్టర్ రజితరెడ్డి అభినందించారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక