
అలుగు విక్రయించేందుకు యత్నం
ఆదిలాబాద్‌టౌన్: అడవిలో అరుదుగా కనిపించే అలుగును అక్రమంగా విక్రయించేందుకు యత్నించిన నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఇన్‌చార్జి అటవీ అధికారి, ఉట్నూర్ ఎఫ్‌డీవో రేవంత్ చంద్ర తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అటవీ కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడు తూ గాదిగూడ మండలం అర్జుని గ్రామ పరిధిలోని పంట పొలంలో గల వలలో అరుదైన అలుగు చిక్కుకుంది. గమనించిన కొందరు వ్యక్తులు దాన్ని విక్రయించేందుకు యత్నించారు. దీనిపై సమాచా రం అందడంతో అటవీ శాఖ సిబ్బంది మంగళవా రం అక్కడికి చేరుకుని కినక శంకర్, పెందూర్ జు గ్నాథ్, పెందూర్ మహేశ్‌లను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి అ లుగును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన ట్లు వివరించారు. నిందితులను కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించామన్నారు. ఆదిలాబాద్ ఎఫ్‌ఆర్‌వోలు గులాబ్ సింగ్, టాస్క్‌ఫోర్స్ ఎఫ్‌ఆర్‌వో జి.శ్రీనివాస్, యాంటీ కోచింగ్ స్క్వాడ్ ఎఫ్‌ఆర్‌వో ముఖ్తార్ అహ్మద్, ఎఫ్‌ఎస్‌వో గోపాల్, సిబ్బంది సుభాష్, సజన్, రాజేందర్, విజయ్ పాల్గొన్నారు.