
ఇరిగేషన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
మంచిర్యాలటౌన్: ఇరిగేషన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని టీఎన్జీవోస్ సభ్యులు మంగళవారం జిల్లాకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను కోరారు. స్పందించిన ప్రిన్సిపల్ సెక్రెటరీ త్వరలోనే పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజినీర్ సత్యరాజ్ చంద్ర, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ విష్ణు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కుమార్, జి.వెంకటరమణ, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, కార్యదర్శి రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, ఉపాధ్యక్షులు శివప్రసాద్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, రోశయ్య, తదితరులు పాల్గొన్నారు.