
వాల్మీకి జీవితం స్ఫూర్తిదాయకం
బాసర: బాసర ఆర్జీయూకేటీ కళాశాలలో మంగళవారం వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ గోవర్ధన్ వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తపస్సుతో మహనీయుడుగా మారి ప్రపంచానికే జ్ఞాన జ్యోతిని చూపించిన కారుణ్యమూర్తి వాల్మీకి అన్నారు. ఆయన జీవితం ఈ సృష్టి ఉన్నంత కాలం స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విట్టల్, డాక్టర్ మహేష్, డాక్టర్ నాగాంజనేయులు, డాక్టర్ దేవరాజు, డాక్టర్ అజయ్ కుమార్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ నాగసాయి, బద్రి హరికృష్ణ, చిన్నారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.