
ఇరువర్గాలపై కేసు నమోదు
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని కాలేజ్‌రోడ్డులో దారి విషయంలో ఈనెల 5న జరిగిన గొడవలో ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రమోద్‌రావు తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నరేందర్, రాజ్‌కుమార్‌ల మధ్య జరిగిన గొడవలో ఇరువర్గాలకు చెందిన అరున్, దినేష్, హారీష్, పరమేశ్, శ్రీకాంత్, చింతల కృష్ణ, ఆవునూరి రమేశ్, వినయ్, అవినాశ్, చందు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు పది మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారని, మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు.