
కొలాం వీరుడు సూరుకు నివాళి
కెరమెరి(ఆసిఫాబాద్): గిరిజన అమరుడు కుమురం భీంకు పోరాటంలో సహాయ సహకారాలు అందించిన కొలాం వీరుడు కుమురం సూరు 28వ వర్ధంతిని మంగళవారం జోడేఘాట్‌లో సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. వారసులు పాండు, రాజు, ధర్మూ, భీంరావు జెండాలు ఎగురవేసి పూజలు చేశారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఎస్పీ కాంతిలాల్ పాటిల్, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, ఏఎస్పీ చిత్తరంజన్, డీఎఫ్‌వో నీరజ్‌కుమార్, ఆర్డీవో లోకేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్, డీడీ రమాదేవి, ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప సూరు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పూజల్లో పాల్గొన్నారు.

కొలాం వీరుడు సూరుకు నివాళి