
‘ప్రాణహిత’ను పరిశీలించిన నీటిపారుదల శాఖ అధికారులు
కౌటాల: మండలంలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్‌పాటిల్ ఇరిగేషన్ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. గతంలో ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదిత స్థలం, ప్రస్తుత ప్రతిపాదిత స్థలంపై అధికారులు మ్యాప్‌తో ఆయనకు వివరించారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత వివరాలపై అధికారులు, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. వైన్‌గంగ, వార్ధా నదుల సంగమంతో తుమ్మిడిహెట్టి వద్ద ఏర్పడే ప్రాణహిత సంగమంను ఆయన బైనాక్యులర్‌తో వీక్షించారు. బ్యారేజీ నిర్మాణం చేపట్టే ప్రదేశాన్ని చూశారు. ప్రాణహిత నది నీటి లభ్యత, ప్రాజెక్టు విధివిధానాలపై సమగ్ర వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ సత్యరాజచంద్ర, ఎస్‌ఈ రవికుమార్, ఈఈ ప్రభాకర్, తహసీల్దార్ ప్రమోద్‌కుమార్, డీఈ వెంకటరమణ, భానుమూర్తి, భద్రయ్య, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.