
ఎంసీహెచ్‌లో 24 గంటల్లో 24 ప్రసవాలు
మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో మంగళవారం అరుదైన రికార్డు నెలకొల్పారు. ఈ నెల 6న ఉదయం 9 గంటల నుంచి 7న ఉదయం 9 గంటల వరకు 24 ప్రసవాలు చేశారు. ఆన్‌డ్యూటీ డాక్టర్ కృష్ణవేణి, డాక్టర్ హారిక ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది ఆరు సాధారణ ప్రసవాలు, 18 సిజేరియన్‌లు చేశారు. మొత్తంగా 24 గంటల్లో 24 ప్రసవాలు చేసి ఘనతను సాధించారు. చిన్నారులు, తల్లులు క్షేమంగా ఉన్నారని వైద్యులు, సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. వైద్య బృందంలో ప్రొఫెసర్ హిమబిందు, అసోసియేట్ ప్రొఫెసర్ మాధవి, వైద్యులు అలివేణి, కీర్తి, ప్రశాంతి, ప్రియదర్శిని, సింధూజ, మిడ్‌వైఫ్స్ అలివేలు పుష్ప, సంధ్య, సౌందర్య, సువర్ణ ఉన్నారు. వైద్యులు, వైద్య సిబ్బందిని సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి, ఆర్‌ఎంవోలు భీష్మ, శ్రీధర్ అభినందించారు.