
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి
మంచిర్యాలక్రైం: మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను మంగళవారం రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచం ఉన్నంత వరకు రామాయణం, వాల్మీకి చరిత్ర ఉంటుందని అన్నారు. రామాయణం సత్యం, నీతి, ధర్మం, కర్తవ్యాన్ని బోధించిన అమృత గ్రంథమణి అన్నారు. డీసీపీ ఏ.భాస్కర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీని వాస్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏఓ శ్రీనివాస్, ఆర్‌ఐలు దామోదర్, శ్రీనివాస్, మల్లేశం పాల్గొన్నారు.