
బాక్సింగ్ ఎంపిక పోటీలు
మంచిర్యాలఅర్బన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో సోమవారం అండర్–17బాలబాలికల జిల్లాస్థాయి బాక్సింగ్ ఎంపిక పోటీలు నిర్వహించారు. పోటీలను పా ఠశాల ప్రధానోపాధ్యాయుడు బండి రమేశ్ ప్రా రంభించగా వివిధ పాఠశాలల నుంచి 70 మంది క్రీడాకారులు హాజరయ్యారు. తొమ్మిది మంది ఎంపికయ్యారని, ఈనెల 8న నిర్మల్‌లో నిర్వహించేజోనల్ పోటీలలో పాల్గొంటారని ఎస్‌జీ ఎఫ్ సెక్రటరీ యాకుబ్ తెలిపారు. పోటీల పర్యవేక్షకుడు రేణి రాజయ్య, వివిధ పాఠశాలలకు చెందిన పీఈటీలు, పీడీలు పాల్గొన్నారు.
ఆర్జీయూకేటీలో సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు
బాసర: బాసర ఆర్జీయూకేటీ కళాశాలలో డిసెంబర్ 2 నుంచి 5వ తేదీ వరకు సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కళాశాల వైస్ చాన్స్‌లర్ గోవర్ధన్ తెలిపారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, కళాత్మకత పెంపొందించేందుకు ఇలాంటి సమ్మేళనాలు ఉపయోగపడతాయన్నారు. 1977లో పద్మశ్రీ డా.కిరణ్ సేత్ ఢిల్లీ ఐఐటీలో ప్రారంభించిన స్పిక్ మెకే దేశవ్యాప్తంగా యువతను ఎంతగానో ఆకట్టుకుందన్నారు. సంగీతం, నృత్యం, జానపద కళలు, హస్తకళలు, చిత్రకళలతో పాటు భారతీయ తాత్త్విక విలువలను చేరవేయడమే కార్యక్రమం లక్ష్యమన్నారు. కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి కళాకారులు రానున్నట్లు తెలిపారు.
‘నవోదయ’లో ప్రవేశానికి నేటితో ముగియనున్న గడువు
కాగజ్‌నగర్‌టౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి 9, 11 తరగతుల్లో ప్రవేశానికి మంగళవారంతో గడువు ముగుస్తుందని ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు ఆన్‌లైన్ ద్వారా 678 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ఎనిమిదో తరగతి, పదోతరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ఒకరి రిమాండ్
మామడ: ద్విచక్ర వాహనాలు చోరీ చేసిన ఒకరిని సోమవారం అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ గోవర్దన్‌రెడ్డి, ఎస్సై అశోక్ తెలిపారు. మండలంలోని కిషన్‌రావుపేట్ గ్రామానికి చెందిన బానావత్ వెంకట్రావ్ జల్సాలకు అలవాటుపడి ఇటీవల పరిమండల్‌లో ధర్మన్నకు చెందిన స్టార్ స్పోర్ట్స్ బైక్‌తో పాటు ఆర్మూర్‌లో ఫ్యాషన్‌ప్రో దొంగిలించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు.