
నిప్పంటించుకొని మహిళ ఆత్మహత్యాయత్నం
నెన్నెల: దంపతుల మధ్య జరిగిన గొడవతో మనస్తాపానికి గురైన భార్య ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గుండ్లసోమారం గ్రామానికి చెందిన జాడి రాజన్న, లలిత దంపతులకు కూతురు అంజలి, కుమారుడు తేజ ఉన్నారు. సోమవారం ఉదయం అంజలి సారీ ఫంక్షన్ విషయంలో ఇద్దరూ గొడవపడ్డారు. మనస్తాపానికి గురైన లలిత ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. నుదురు, మెడ, రెండు చేతులు, చాతి భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. మంటలను అర్పే క్రమంలో రాజన్నకు చేయి, వీపుపై గాయాలయ్యాయి. దంపతులిద్దరిని 108లో బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై ఎస్సై ప్రసాద్‌ను సంప్రదించగా ఘటనపై ఇంత వరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు.

నిప్పంటించుకొని మహిళ ఆత్మహత్యాయత్నం