
అడ్డగోలుగా చెట్ల నరికివేత
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల ము న్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాలతో పాటు హాజీపూర్ మండలంలో పచ్చని చెట్లు నరికివేతకు గురవుతున్నాయి. గతంలో రాపల్లిలో, ఇటీవల నర్సింగాపూర్‌లో ఆదివారం గుడిపేట, నంనూర్‌లో రహదారి పక్కనున్న చెట్ల కొమ్మలు అడ్డగో లుగా నరికివేశారు. ఇందుకోసం విద్యుత్ సరఫరా నిలిపివేశారు. నర్సింగాపూర్‌కు వెళ్లే రహదారిలో గతంలో హరితహారంలో భాగంగా నాటిన చెట్లు ఏపుగా పెరగడంతో వాటిని కొంతమంది యంత్రంతో ఒక్క పూటలోనే గుర్తు పట్టకుండా నరికేస్తున్నా రు. కొద్దికాలంగా ఈ చెట్లు, చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలకు అడ్డుగా వస్తున్నాయనే సాకుతో విద్యుత్‌శాఖ పేరు చెప్పి గుర్తు తెలియని వ్యక్తులు యంత్రాలతో కొట్టి వేస్తున్నారు. స్థానికంగా ఉన్న ఓ నాయకుడు ఈ చెట్ల కొమ్మలు, చెట్లను అడ్డగోలుగా నరికిస్తూ స్థానికంగా ఉన్న ఓ బ్రెడ్ కంపెనీకి అమ్ముకుంటూ రూ.లక్షలు గడిస్తున్నాడనే ఆరోపణలున్నాయి. ఇంత జరుగుతున్నా ఎవరూ పట్టించుకోడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా చెట్ల నరికివేతను అడ్డుకోవాలని కోరుతున్నారు.