
పద్మశాలీలు రాజకీయంగా రాణించాలి
దండేపల్లి: పద్మశాలీలు రాజకీయంగా రాణించాలని పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షుడు గాదాసు బాపు సూచించారు. స్థానిక పద్మశాలీ భవనంలో నూతనంగా ఎన్నుకోబడిన దండేపల్లి మండల పద్మశాలీ సంఘం కమిటీతో ఆదివారం ప్రమాణ స్వీకారం చే యించారు. కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం ఉన్న చోట ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ చేయాలని సూచించారు. రాజకీయంగా ఎదిగినప్పుడే సమాజంలో గుర్తింపు వస్తుందని తెలిపారు. పద్మశాలీ సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు వంగ శంకరయ్య, ఎనగందుల సత్యం, రాష్ట్ర మహిళ కార్యదర్శి మంగ, నాయకులు నాగరాజు, వీరస్వామి, కుటుంబరావు, చిన దుబ్బయ్య, శంకరయ్య, కిషన్, చిలుకన్న, శ్రీనివాస్ పాల్గొన్నారు.