
మహారాష్ట్ర రోడ్డు ప్రమాదంలో రాంటెక్ వాసి..
ముధోల్: మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాంటెక్ వాసి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని రాంటెక్ గ్రామానికి చెందిన కొమురపెల్లి జనార్దన్ (55) మహారాష్ట్రలోని పూణేలో ఉన్న కుమార్తె ఇంటికి వెళ్లాడు. శనివారం తిరుగుప్రయాణంలో ప్రైవేటు ట్రావెల్స్‌లో వస్తుండగా పూణే శివారులో మార్గ మధ్యలో హోటల్ వద్ద వాహనాన్ని ఆపారు. అయితే కాలకృత్యాలు తీర్చుకునేందుకు జనార్దన్ రోడ్డు దాటుతుండగా మహారాష్ట్రకు చెందిన వాహనం వెనక నుంచి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహానికి ఆదివారం స్వగ్రామం రాంటెక్‌లో అంత్యక్రియలు నిర్వహించారు.