
బైక్ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య
లక్సెట్టిపేట: బైక్ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్సై గోపతి సురేశ్ తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని క్లబ్ రోడ్‌కు చెందిన రాథోడ్ మణికంఠ (20) మంచిర్యాలలోని కళాశాలలో ఐటీఐ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. పది రోజులుగా బైక్ కొనివ్వాలని తల్లిదండ్రులను అడుగుతున్నాడు. ఈ నెల 4న సాయంత్రం బైక్ కొనివ్వాలని పట్టుబట్టడంతో కొన్నిరోజుల తర్వాత కొనిస్తామని తల్లిదండ్రులు సర్దిచెప్పారు. అయినా వినకుండా ఇంట్లోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తండ్రి దారా సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.