
పురుగుల మందు తాగి ఒకరు ...
లక్ష్మణచాంద: మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని కనకాపూర్ గ్రామానికి చెందిన తుదిగని వినోద్ (35) కొంతకాలంగా మద్యానికి బానిసై ఖాళీగా తిరుగుతున్నాడు. రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ నెల 3న మద్యం మత్తులో గుర్తు తెలియని పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు నిర్మల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి ఆదివారం ఉదయం మృతి చెందాడు. మృతుని భార్య శైలజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.