
అ‘పూర్వ’ సమ్మేళనం
దస్తురాబాద్: మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 1999–2000 విద్యాసంవత్సరంలో పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థులు మళ్లీ 25 సంవత్సరాల తరువాత ఆదివారం ఒకేచోట కలుసుకున్నారు. ఈ సందర్భంగా తమకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.
లక్ష్మణచాంద: మండలంలోని వడ్యాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1995–1996 విద్యాసంవత్సరంలో పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఆదివారం పీచరలోని ఓ ఫంక్షన్‌లో హాల్‌లో కలుసుకున్నారు. ఒకరికొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు గాజులు వేసుకుని శుభాకాంక్షలు తెలుపుకోగా పురుషులు శాలువాలు కప్పుకున్నారు. అనంతరం సహపంక్తి భోజనం చేశారు.
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలోని సీసీసీ కార్నర్‌లో గల స్వాతి హైస్కూల్‌లో 2006–07 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు జిల్లా కేంద్రంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ప్రిన్సిపాల్ నారాయణరాజు, అధ్యాపకులు మంజుల, మూర్తి, భాను, సత్యం, రవి, రాజ్‌కుమార్‌ను ఘనంగా సన్మానించారు.

అ‘పూర్వ’ సమ్మేళనం

అ‘పూర్వ’ సమ్మేళనం