
జలం.. కలుషితం
బెల్లంపల్లి: చెరువుల్లోని జలం కలుషితమవుతోంది. సింగరేణి పవర్ హౌస్ అవసరాల కోసం సుమారు ఎనిమిది దశాబ్దాల క్రితం బెల్లంపల్లిలో గొలుసు కట్టుగా మూడు చెరువులు నిర్మించారు. గురిజాలకు వెళ్లే మార్గంలో గ్రామ దేవత పోశమ్మ గుడి ఉంది. దీనిని ఆనుకుని నిర్మించిన జలాశయాలకు పోశమ్మ చెరువులుగా పేరు స్థిరపడి పోయింది. రెండు దశాబ్దాల క్రితం బెల్లంపల్లిలోని సింగరేణి పవర్ హౌస్ ను కొందరు సింగరేణి అధికారులు అనాలోచిత విధానాలతో మూసివేశారు. దాని సామగ్రిని ముంబైకి చెందిన ఓ ప్రైవేట్ కంపెనీకి స్క్రాప్ కింద కారుచౌకఽగా విక్రయించారు. దీంతో అప్పటి నుంచి పోశ మ్మ చెరువుల నీళ్లు సింగరేణికి వినియోగించలేని ప రిస్థితులు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి దుస్తులు శు భ్రం చేయడానికి, అంత్యక్రియలు నిర్వహించాక స్నానాలు చేయడానికి మాత్రమే పురప్రజలు విని యోగిస్తున్నారు. ఎంత తీవ్రమైన వేసవిలోనైనా చె రువుల్లోని జలాలు అడుగంటడంలేదు. మూగజీవా ల దాహార్తిని తీర్చుతున్నాయి. గంగపుత్రులు ఈ చెరువులో కొంతకాలంగా చేపల పెంపకం చేపడుతున్నారు. ఇన్ని రకాలుగా ఉపయోగపడుతున్న పోశమ్మ చెరువుల నీళ్లు క్రమంగా కలుషితమవుతున్నాయి. పురప్రజలకు దుర్గంధం పంచుతున్నాయి.
కలుషితానికి కారణాలివే..
గణేశ్ నవరాత్రులు ముగిశాక విగ్రహాలను పోశమ్మ రెండో చెరువులో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. చాలావరకు రసాయనిక పదార్థాలతో తయారు చేసిన విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేస్తుండడంతో నీరు కలుషితమవుతోంది. ఇలా ఎన్నో ఏళ్లుగా చెరువులో విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. ఒక్కసారి కూడా చెరువు పూడిక తీసిన దాఖలాలు లేవు. దీంతో చెరువు నుంచి వచ్చే దుర్గంధం భరించలేక పుర ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పోశమ్మ పెద్ద చెరువు కట్ట చివరలో బతుకమ్మ ఘాట్ నిర్మించారు. ఈ ఘాట్ వద్ద సద్దుల బతుకమ్మ రోజు బతుకమ్మలు నిమజ్జనం చేస్తున్నారు. సహజసిద్ధంగా పూసిన పూలతో పాటు రంగులద్దిన పూలనూ బతుకమ్మలు పేరుస్తుండటంతో అవి నీటిలో కొంతకాలం పాటు మురిగి జల కా లుష్యాన్ని పెంపొందిస్తున్నాయి. గత నెలలో నిమజ్జనం చేసిన బతుకమ్మలు ప్రస్తుతం ఘాట్‌వద్ద కు ప్పలుగా పేరుకుపోయాయి. ఇలా కొన్నాళ్ల నుంచి ని మజ్జనం చేస్తున్న బతుకమ్మలన్నీ అడుగు భాగంలో ఉండి పోవడంతో నీరు కలుషితమవుతోంది. పోశమ్మ చెరువు నీళ్లు ఒకప్పుడు పురప్రజల తాగునీటి అవసరాలు తీర్చగా ప్రస్తుతం కలుషితమై ఎందుకూ పనికిరాకుండా తయారయ్యాయి.
పట్టించుకునేవారేరి?
వినాయకుడి విగ్రహాలు, బతుకమ్మల నిమజ్జనాలతో పోశమ్మ చెరువుల నీళ్లు నిర్మలత్వాన్ని కోల్పోతున్నాయి. రంగుమారి దర్శనమిస్తున్నాయి. అసలు స్నానం చేయడానికి కూడా పనికి రావని పురప్రజలు చెబుతున్నారు. అంతగా నీళ్లు కలుషితమై పోతున్నా ఎవరూ చెరువుల ముఖం చూసిన దాఖలాలు లేవు. ఏడాదికి రెండుసార్లు నిమజ్జనాల సందర్భాల్లో మినహా ఎప్పుడూ పట్టించుకున్న పాపాన పోవడంలేదనే విమర్శలున్నాయి. ఇప్పటికై నా జీవాలు, ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నీటి కాలుష్యం ఏర్పడకుండా తగినచర్యలు చేపట్టాలని పురప్రజలు కోరుతున్నారు.

జలం.. కలుషితం