
తెలుగుపై పట్టు సాధించేలా..
విద్యార్థులు సరళంగా తెలుగు భాష నేర్చుకోవడం, అక్షరదోషాలు లేకుండా రాయడం, పలకడం కోసం నేను టీఎల్‌ఎం తయారు చేశాను. టెలిఫోన్ ద్వారా పదాలు గుర్తించడం, పలకడం, క్యారంబోర్డు ద్వారా కొత్త అక్షరాల గుర్తింపు, టీకప్పుల ద్వారా అక్షర మాల, ఇతర వ్యర్థాలతో తయారు చేసిన వస్తువులతో గుర్తుంచుకునేలా సరళ పదాలు, దిత్వ అక్షరాలు, సంయుక్త అక్షరాలు, ఒత్తులు, దీర్గాలు, తదితర పొందుపర్చాను. పిల్లలు సంతోషంగా ఆటలాడుతూ వీటిని నేర్చుకుంటున్నారు. తరగతి గదిలో వీటి ద్వారా విద్యాబోధన చేస్తున్నాను. – కవిత, ఎంపీపీఎస్ మావల–2