
రేషన్ బియ్యం తరలిస్తున్న ఇద్దరి అరెస్టు
ఆదిలాబాద్‌టౌన్: రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. శనివా రం వన్‌టౌన్‌లో ఈ మేరకు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని ఖిల్లాకు చెందిన షేక్ ఫైసల్, చిల్కూరిలక్ష్మినగర్‌కు చెందిన అబ్దుల్ సత్తార్‌లు బొక్కల్‌గూడలో అక్రమంగా బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. పోలీసులకు అందిన సమాచారంతో దాడి చేసి వారి నుంచి 3.2 క్వింటాళ్ల బియ్యంతోపాటు స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వీరిద్దరిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
డివైడర్‌ను ఢీకొన్న కారు
అంబేడ్కర్ ఫ్లెక్సీని అవమానించిన ఒకరిపై కేసు
భైంసాటౌన్: అంబేడ్కర్ చిత్రపటం ఉన్న ఫ్లెక్సీని అవమానించిన ఒకరిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ జి.గోపినాథ్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. పట్టణంలోని గోపాల్‌నగర్‌కు చెందిన దేవిదాస్‌కు చెందిన యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి దుర్గామాత విగ్రహ నిమజ్జన ర్యాలీ సందర్భంగా అదేకాలనీకి చెందిన బుద్దరతన్.. అంబేడ్కర్ చిత్రపటం ఉన్న ఫ్లెక్సీతో వీరి బృందంలో చేరి నృత్యం చేశాడు. దీంతో ఆగ్రహించిన దేవిదాస్ అతని చేతిలో ఫ్లెక్సీని లాక్కుని చించివేశాడు. శనివారం విషయం తెలుసుకున్న దళిత యువకులు అధిక సంఖ్యలో దేవిదాస్ ఇంటికి చేరుకుని అతన్ని బస్టాండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహం వద్దకు తీసుకువచ్చారు. అంబేడ్కర్ విగ్రహానికి క్షమాపణలు చెప్పించారు. అనంతరం బుద్దరతన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
పాఠశాలలో వరుస చోరీలపై ఫిర్యాదు
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాకేంద్రంలోని జన్కాపూర్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న వరుస చోరీలపై హెచ్‌ఎం ఉదయ్‌బాబు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాఠశాలలో గతనెల 16 నుంచి ఈనెల 3వ తేదీ వరకు మూడుసార్లు గుర్తుతెలియని వ్యక్తులు చొరబడ్డారు. హెచ్‌ఎం రూం, ల్యాబ్‌లో వస్తువులను ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు.