
దాడి కేసులో ఏడుగురి అరెస్టు
కాసిపేట: ఒకరిపై దాడి చేసిన కేసులో ఏడుగురిని శనివారం అరెస్టు చేసినట్లు దేవాపూర్ ఎస్సై గంగారాం తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లో ఈమేరకు వివరాలు వెల్లడించారు. మండలంలోని కొండాపూర్ సబ్‌స్టేషన్ సమీపంలో వైన్ షాప్ వద్ద ఈనెల 3న అచ్యుతరావ్ గూడెంకు చెందిన గూడెం రాంచందర్ ఉన్నాడు. దేవాపూర్‌కు చెందిన బోర్లకుంట ప్రణయ్, రాంటెంకి చంద్రయ్య, చునార్కర్ రాజేష్, కోమటిచేనుకు చెందిన జాడి కిరణ్, దుర్గం శేఖర్, బోర్లకుంట ప్రవీణ్, జాడి సాగర్ అకారణంగా దాడి చేశారు. రాంచందర్‌ను దుర్బాషలాడుతూ చేతులు కాళ్లతో తన్ని బీరు బాటిల్‌తో కొట్టి గాయపర్చారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి ఏడుగురిని అరెస్టు చేశారు. గతంలో నేరచరిత్ర ఉన్న బోర్లకుంట ప్రణయ్‌పై రౌడీషీట్ తెరవనున్నట్లు ఎస్సై తెలిపారు.