
అంబులెన్స్‌లో ప్రసవం
జన్నారం: మండలంలోని కిష్టాపూర్‌కు చెందిన లత అనే గర్భిణి అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకువస్తుండగా మార్గమధ్యలో ప్రసవించింది. శనివారం ఉదయం ఆమెకు పురిటినొప్పులు రావడంతో కుటుంబీకులు అంబులెన్స్ సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకుని ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా ఆమెకు పురిటినొప్పులు అధికమయ్యాయి. ఈక్రమంలో పురుడుపోయగా ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ఒక పాప ఏడవకపోవడంతో ఎన్‌ఎన్‌ఆర్ చేయగా ఏడ్చినట్లు ఈఎంటీ జాడి రమేశ్ తెలిపారు. తల్లీబిడ్డలను జగిత్యాల ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.