
పకడ్బందీగా ఎన్నికల ఏర్పాట్లు
బెల్లంపల్లి: ఎన్నికల నిర్వహణకు క్షేత్రస్థాయిలో పకడ్బందీ ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు సూచించారు. శనివారం బెల్లంపల్లిలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ (సీఈవో ) పాఠశాల, కళాశాల, బజారు ఏరియాలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాట్లను డీసీపీ ఎగ్గడి భాస్కర్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు కోసం మండల స్థాయిలో తహసీల్దార్‌లను నోడల్ అధికారులుగా నియమించినట్లు తెలిపారు. ఎన్ని కల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ ఎ.రవికుమార్, రూరల్ సీఐ హనోక్, తదితరులు పాల్గొన్నారు.
సమాచారం, ఫిర్యాదులకు హెల్ప్‌లైన్
మంచిర్యాలఅగ్రికల్చర్: పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా సమాచారం, ఫిర్యాదులకోసం సమీకృత కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల దృష్ట్యా నామినేషన్లు, పరిశీలన, ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా, పోలింగ్ కేంద్రాలు, పోలింగ్, పోస్టల్ బ్యాలెట్, ఇతర ఎన్నికల సమాచారం, ఫిర్యాదులు, ఇతర దరఖాస్తుల కోసం హెల్ప్‌లైన్ 08736–250251 ఏర్పాటు చేశామని, 24/7 సహాయ కేంద్రం సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే సమాచారం అందించాలన్నారు.