
బీసీలు రాజ్యాధికారం సాధించాలి
పాతమంచిర్యాల: బీసీలు సంఘటితంగా ఉండి రాజ్యాధికారం సాధించాలని బీసీ సమాజ్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సుచిత్ర ఫంక్షన్ హాల్‌లో బీసీల అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడు తూ బీసీ సంఘాలు వేరైనా నినాదం ఒక్కటేనన్నారు. సంఘటితమే బీసీలను రాజ్యాధికారం వైపు నడిపిస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో మన ఓట్లు మనమే వేసుకోవాలన్నారు. అగ్ర వర్ణ విభజన రాజకీయాల్లో కుట్రలు, కుతంత్రాలను బీసీలు గమనించాలన్నారు. రాజ్యాధికార సాధనకు బీసీలు ప్రణాళికతో ముందుకెళ్లాలని పలువురు వక్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడల శ్రీనివాసులు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్, బీసీ సంఘం రాష్ట్ర నాయకురాలు సంధ్యారాణి, మంచిర్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండ వరపు జగన్, బీసీ నాయకులు అరుణ్ కుమార్, తులా మధుసూదన్‌రావు, కర్రె లచ్చన్న, గజెళ్లి వెంకటయ్య, సదానందం, వడ్డేపల్లి మనోహర్ పాల్గొన్నారు.